Perl చాలా డాక్యుమెంటేషన్లతో వస్తుంది,కానీ మనం అన్ని ఉపయోగించడానికి కొంత సమయం పడుతుంది. ఈ Perl tutorial లో డాక్యుమెంటేషన్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం.

వెబ్ లో perldoc

perldoc వెబ్‌సైట్ ని సందర్శించి చాలా సులభంగా డాక్యుమెంటేషన్ ని వాడుకోవచ్చు.

ఇది HTML వర్షన్ డాక్యుమెంటేషన్ కల్గి ఉంటుంది. modules, Perl 5 Porters అనుసరించి core Perl తో వస్తాయి.

ఇది CPAN modules డాక్యుమెంటేషన్ ని కల్గి ఉండదు. CPAN నుండి వచ్చే కొన్ని modules, standard Perl distribution లో కుడా వుంటాయి.(వాటిని dual-lifed గా రెఫర్ చేస్తారు.)

పైన కుడి వైపు (right side) ఉన్న సర్చ్ బాక్స్ ఉపయోగించుకోవచ్చు. split అని టైప్ చేస్తే split కి సంబందించిన డాక్యుమెంటేషన్ వస్తుంది.

while,$_ లేక @_ వాడినప్పుడు రిసల్ట్ ఏమీ చూపించదు. వీటి కోసం మీరు డాక్యుమెంటేషన్ చూడవలెను. perlvar పేజ్ లో $_ మరియు @_ గురించి వుంటుంది. perlsyn లో while loop గురించి మరియు కొన్ని Perl సింట్యాక్స్ గురించి వుంటుంది.

command line లో perldoc

ఈ డాక్యుమెంటేషన్ Perl సోర్స్ కోడ్ తో వస్తుంది, కానీ ప్రతి Linux distribution దానంతట అదే ఇన్స్టాల్ చేసుకోదు.

కొన్ని సందర్బాలలో వేరే ప్యాకేజ్ లో ఈ డాక్యుమెంటేషన్ వుంటుంది.

ఉదాహరణకు Debian and Ubuntu లో perl-doc అనే ప్యాకేజ్ వుంటుంది. మీరు perldoc ని ఉపయోగించాలి అంటే ముందు గా sudo aptitude install perl-doc అని perldoc ని ఇన్స్టాల్ చేసుకోవాలి.

ఇన్స్టాల్ చేసిన తరువాత,perldoc perl అని కమాండ్ లైన్ లో టైపు చేస్తే మీకు కొన్ని Perl డాక్యుమెంటేషన్ లో ఉన్న చాప్టర్ లిస్టు మరియు వివరణలు వస్తాయి.

ఈ డాక్యుమెంటేషన్ నుండి బయటికి రావాలంటే q కీ ని ప్రెస్ చేయండి.

చాప్టర్ చూడడానికి దాని పేరుని టైపు చేయండి. ఉదాహరణ: perldoc perlsyn.

CPAN modules డాక్యుమెంటేషన్

CPAN లో ప్రతి module డాక్యుమెంటేషన్ మరియు ఉదాహరణలతో వుంటాయి. ఈ డాక్యుమెంటేషన్లు వాటిని వ్రాసే authors మీద ఆదారపడి వుంటాయి.

మీరు Module::Name ని ఇన్స్టాల్ చేసారు అనుకుందాం. ఈ డాక్యుమెంటేషన్ కోసం perldoc Module::Name అని టైప్ చేసి వాటి వివరాలు పొందవచ్చు.

మీరు ఎటువంటి module ఇన్స్టాల్ చెయ్యకుండా ఈ డాక్యుమెంటేషన్ CPAN వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా పొందవచ్చు. Meta CPAN మరియు search CPAN లు ముఖ్యమైనవి. ఈ రెండూ ఒకే డాక్యుమెంటేషన్ మీద ఆదారపడి వుంటాయి, కానీ డాక్యుమెంటేషన్ చూపించే విదానంలో తేడా వుంటుంది.

Perl Maven లో కీవర్డ్ సెర్చ్

ఈ సైట్ పైన మెనూబార్ లో కీవర్డ్ సెర్చ్ ని పెట్టాము. దీని ద్వారా మీరు ఈ సైట్ లో ఉన్న Perl ఆర్టికల్స్ని సెర్చ్ చెయ్యవచ్చు. కొంతకాలం తరువాత కోర్ Perl డాక్యుమెంటేషన్ మరియు CPAN లో ముఖ్యమైన modules చేర్చబడతాయి.

Next

తరువాతి భాగం POD - Plain Old Documentation.